calender_icon.png 17 September, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నారాయణపూర్ నిర్వాసితులకు పరిహారం అందజేస్తాం

17-09-2025 02:08:26 AM

భరోసా కల్పించిన ఎమ్మెల్యే మేడిపల్లి

గంగాధర, సెప్టెంబర్16(విజయక్రాంతి): ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ క్రింద భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా కల్పించారు. గంగాధర మండలం నారాయణపూర్, మంగపేట గ్రామస్తులు మంగళవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను గంగా ధరలోని ప్రజా కార్యాలయంలో కలిశారు.

ఈ సందర్భంగా నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం అందించడానికి ప్రభుత్వం రూ. 23 కోట్లు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే వివరించారు. త్వరలోనే నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని భరోసా కల్పించారు.

ఇచ్చిన మాట ప్రకారం నారాయణపూర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని తెలిపారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి నిర్వాసితులు ఆందోళనకు గురికా వద్దని, అన్ని రకాలుగా అండగా ఉండి ఆదుకుంటామనిహామీఇచ్చారు.