20-11-2025 12:15:08 AM
టాప్ ప్లేస్‌లో కివీస్ బ్యాటర్ మిఛెల్
దుబాయి, నవంబర్ 19 : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన నెంబర్ వన్ ర్యాంకును చేజార్చుకున్నాడు. తాజాగా ప్రకటించిన జాబితాలో రోహిత్ రెండో ప్లేస్‌కు పడిపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన హిట్‌మ్యాన్ ఆ ప్రదర్శనతోనే టాప్ ప్లేస్‌కు దూసుకొచ్చి చరిచ్ర సృష్టించాడు. అయితే తాజాగా న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిఛెల్ అగ్రస్థానం కైనసం చేసుకున్నాడు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన మిఛెల్ రెండు స్థానాలు మెరుగై టాప్ ప్లేస్ సాధించాడు. తద్వారా వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచిన రెండో కివీస్ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ తన ఫామ్ కొనసాగిస్తే మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లే అవకాశముంది. కాగా టాప్ భారత్ నుంచి రోహిత్‌తో పాటు ్ల, గిల్ (4)విరాట్ కోహ్లీ(5) కూడా ఉన్నారు.
శ్రేయాస్ అయ్యర్ 8వ ర్యాంకులోనూ, కేఎల్ రాహుల్ 16వ ర్యాంకులోనూ కొనసాగుతున్నారు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ యాదవ్(6) ఒక్కడే టాప్ చోటు దక్కించుకున్నాడు. అటు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో స్టార్ పేసర్ బుమ్రా నెం.1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. కుల్దీప్ 13, జడేజా 15వ స్థానాల్లో నిలిచారు. సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా టెస్టుల్లో టాప్‌ఊ ఎంట్రీ ఇచ్చాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ గిల్ 11వ స్థానంలో ఉన్నాడు.