20-11-2025 12:16:32 AM
తొలి మ్యాచ్‌లో అమెరికాతో భారత్ ఢీ
దుబాయి, నవంబర్ 19 :వచ్చే ఏడాది జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగను న్న అండర్ ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. 23 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకూ కుర్రాళ్ల వరల్డ్‌కప్ జరుగుతుంది. మొత్తం 41 మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నా యి. గ్రూప్ ఏలో భారత్, బంగ్లాదేశ్, యూఎస్‌ఏ. న్యూజిలాండ్, గ్రూప్ బిలో జింబాబ్వే, పాకిస్తాన్,ఇంగ్లాండ్, స్కాట్లాండ్, గ్రూప్ సిలో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్ , శ్రీలంక, గ్రూప్ డిలో టాంజానియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా చోటు దక్కించుకు న్నాయి.
గత ఎడిషన్ రన్నరప్‌గా నిలిచిన భారత్ తన తొలి మ్యాచ్‌లో జనవరి 15న యూఎస్‌ఏతో తలపడుతుంది. తర్వాత జనవరి 17న బంగ్లాదేశ్‌తో, జనవరి 24న న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది. జింబాబ్వేలో మూడు వేదికలు, నమీబియాలో రెండు వేదికలు టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. గ్రూప్ స్టేజ్‌లో ఒక్కో జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుండగా... తర్వాత సూపర్ సిక్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ జరగనున్నాయి. సెమీస్, ఫైన ల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డేలను కేటాయించారు. భారత్, పాకిస్థాన్ జట్లు వేర్వేరు గ్రూ పుల్లో ఉండడంతో సూపర్ సిక్స్ స్టేజ్ వర కూ తలపడే అవకాశం లేదు.