calender_icon.png 20 November, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశాంత్ టీం బోణీ

20-11-2025 12:13:50 AM

అబుదాబి టీ10 లీగ్

అబుదాబి, నవంబర్ 19 : క్రికెట్ ఫాస్టెస్ట్ ఫార్మాట్ అబుదాబీ టీ10 లీగ్‌లో ఈ సారి భారత క్రికెటర్లు సందడి చేస్తున్నారు. మాజీ స్పిన్నర్ హర్భజన్‌సింగ్, మాజీ బౌలర్ శ్రీశాంత్‌తో పాటు పియూష్ చావ్లా, మురళీ విజయ్ ఈ లీగ్‌లో ఆడుతున్నారు. తాజాగా శ్రీశాంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విస్టా రైడర్స్ బోణీ కొట్టింది. రాయల్ ఛాంప్స్‌పై 9 పరుగుల తేడాతో గెలుపొందింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన విస్టా రైడర్స్ 10 ఓవర్లలో 109/7 స్కోర్ చేసింది. మురళీ విజయ్(4) నిరాశపరిచినా.. మెక్‌డెర్మోట్ (31), డుప్లెసిస్(21) రాణించారు.రిషి ధావన్ 2, రజాక్ 3 వికెట్లు తీశా రు. ఛేజింగ్‌లో రాయల్ ఛాంప్స్ 100 పరుగులే చేయగలిగింది. మరో మ్యాచ్‌లో హర్భ జన్‌సింగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆస్పిన్ స్టాలియన్స్, నార్తర్న్ వారియర్స్ చేతిలో పరాజయం పాలైంది.