13-10-2025 12:58:57 AM
అలంపూర్, అక్టోబర్ 12: మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన హమ్మద్ బీకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. దీంతో నిర్మాణం చేపట్టిన ఆమెకు బ్యాంకు ఖాతాలో రూ.4 లక్షలు జమ అయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కొరకు కృషిచేసిన ఏఐసిసి సంపత్ కుమార్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు.
అనంతరం జిల్లా డిసిసి జనరల్ సెక్రెటరీ మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ... నిరుపేద కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం శుభ పరిణామం అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆదరించాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు లోకేష్ మోహన్, వినయ, మురళి, తాహేబ్, సిరాజ్ జహంగీర్, ప్రసాద్, రమేష్ పాల్గొన్నారు.