calender_icon.png 13 October, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టపరమైన నియమాలను పాటించాలి

13-10-2025 12:57:46 AM

ఎస్పీ  డి. జానకి

మహబూబ్ నగర్ టౌన్ 12: దీపావళి సందర్భంలో టపాసుల విక్రయదారులు తప్పనిసరిగా చట్టపరమైన నియమాలను పాటించాలని జిల్లా ఎస్పీ  డి. జానకి అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో టపాసులు విక్రయించే యజమానులు ప్రకారం అనుమతులు (లైసెన్సులు) తీసుకోవడం తప్పనిసరని జిల్లా ఎస్పీ  డి. జానకి పేర్కొన్నారు.

టపాసుల విక్రయ దుకాణాలు రద్దీ ప్రదేశాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పెట్రోల్ బంకులు సమీపంలో అలాగే వివాదాస్పద స్థలాలలో ఏర్పాటు చేయరాదని, సంబంధిత తహసీల్దార్, ఫైర్ విభాగం, పోలీసు శాఖ సూచించిన ప్రదేశాల్లో మాత్రమే లైసెన్స్ ఉన్న వ్యాపారులు షాపులు నిర్వహించవలసిందిగా సూచించారు.

లైసెన్స్ గడువు ముగిసిన వారు ముందస్తుగా పర్మిషన్,రిన్యువల్ తీసుకొని మాత్రమే టపాసుల విక్రయం కొనసాగించాలి, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ప్రజలు కూడా భద్రతా నియమాలు పాటిస్తూ, పిల్లలను పెద్దల పర్యవేక్షణలో టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.