calender_icon.png 5 May, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సు..లారీ.. ఆటో ఢీ

02-05-2025 12:00:00 AM

ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం 

ఒకరి మృతి.. పలువురికి గాయాలు

నాలుగు పశువుల మృత్యువాత 

ఆదిలాబాద్, మే 1 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో  మండలంలోని మన్నూ ర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై బస్సును వెనుక నుండి వస్తున్న లారీ ఢీకొని, వెంటనే పక్క నుండి వెళుతున్న  ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఆటో నుజ్జు అయింది. లారీ రోడ్డు పక్కన ఉన్న గుంతలు పడిపోయింది. ప్రమాదంలో 4 పశువులు మృత్యువాత పడ్డాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో ఆదిలాబాద్  రిమ్స్ తరలించారు. చికిత్స పొందుతూ బోర జ్ మండలం మాండగాడ గ్రామానికి చెంది న  భీమక్క (65) మృతి చెందారు. 

బస్సుకు తప్పిన పెను ప్రమాదం..

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సును వెనకనుండి వస్తున్న లారీ ఢీకొని పక్కనే వెళ్తున్న ఆటోని సైతం లారీ ఢీకొంది. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలో డివైడర్ పైకి ఎక్కింది. బస్సు లో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటడటం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

ఎమ్మెల్యే పరామర్శ...

రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హుటాహుటిన ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి పరిస్థితి పై ఆరా తీశారు. స్థానికులం తో మాట్లాడి ప్రమాదం గురించి, గాయపడ్డ వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శించారు.