28-05-2025 12:57:48 AM
ఫిషర్‌మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట అదుపులో పెట్టుకొని పొదుపుగా మాట్లాడాలని ఫిషర్‌మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ గురించి 10 నిమిషాలు ఆలో చిస్తే ఆ పార్టీలో నలుగురు తప్పా ఎవరూ ఉండరన్నారు. తాము ఇంకా ఏమీ అనుకోలేదని, అనుకుంటే మీరు ఊహించిన దాని కంటే ఎక్కువే ఉంటుందన్నారు.
మీ భాషలోనే సమాధానం ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాజకీయ వ్యవస్థలో అజ్ఞాని కేటీఆర్ అంటూ విమర్శించారు. తెలంగాణకు కేటీఆర్ శకుని పాత్ర పోషిస్తున్నాడని మండిపడ్డారు. రాత్రి తీసుకున్న డ్రగ్స్‌తో తెలంగాణ భవన్‌లో కూర్చొని చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.
డ్రగ్స్ టెస్టు ఛాలెంజ్‌కి భయపడ్డ కేటీఆర్‌కు.. రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ సమాజాన్ని పది సం వత్సరాలు కొరివి దెయ్యం లాగా పీల్చుకొని తిన్నది మీరేనని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత దెయ్యం అనే పదం కేటీఆర్ గురించేనా తెలుసుకోవాలన్నారు.