calender_icon.png 18 February, 2026 | 5:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచమ్మ ఆలయంలో రుద్ర చండీ హోమం

18-02-2026 12:00:00 AM

మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): మేడ్చల్ సర్కిల పరిధిలోని అత్వెల్లిలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ముత్యాలమ్మ ఆలయంలో మంగళవారం రుద్ర చండీ హోమంను ఘనంగా నిర్వహించారు. అత్వెల్లి వాసులు హోమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ పునర్మిణం చేయడంతో చండీ హోమం నిర్వహించినట్లు నిర్వహకులు తెలిపారు. హోమం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.