18-02-2026 12:00:00 AM
మొయినాబాద్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపురం నుండి నక్కలపల్లి వరకు ఉన్న ప్రధాన రహదారి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గత కొంతకాలంగా కురిసిన వర్షాల కారణంగా ఈ రహదారి పూర్తిగా గుంతలమయమై, ప్రయాణికులు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై గ్రామస్థులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ స్థానిక సర్పంచ్కు విన్నవించారు.
స్పందించిన సర్పంచ్ గ్రామస్థుల మొరను ఆలకించిన వెంటనే వెంకటాపురం సర్పంచ్ అర్చన అజయ్ రెడ్డి లు సానుకూలంగా స్పందించారు. రహదారి దుస్థితిని గమనించి, ప్రయాణానికి ఆటంకం కలగకుండా తక్షణమే మొరం పోసి గుంతలను పూడ్చివేయించారు. మరమ్మతు పనులతో దెబ్బతిన్న రహదారి పునరుద్ధరణకు గురై, రాకపోకలు సాఫీగా రావడంతో స్థానికులు వర్షం వ్యక్తం చేశారు.
గ్రామస్థులు సమస్యను విన్న వెంటనే చొరవ తీసుకుని, యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేయించినందుకు వెంకటాపురం మరియు నక్కలపల్లి గ్రామాల ప్రజలు సర్పంచ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ అభివృద్ధి విషయంలో ఇదే రీతిన స్పందిస్తూ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరారు.కార్యక్రమంలో వార్డు సభ్యులతో పాటు రెండు గ్రామాల ప్రజలు, యువకులు పాల్గొన్నారు.