18-12-2025 06:19:58 PM
భారతీయ సంస్కృతిని ప్రతిబింభించే ఛాయా చిత్రాలు మరెన్నో తీయాలని సూచన..
చిట్యాల (విజయక్రాంతి): లంబాడీ జీవనశైలి, గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలను, ప్రతిబింబించే ఛాయా చిత్రాలు తీసి జాతీయస్థాయి అవార్డును సీనియర్ పత్రికేయులు భయ్యన్న అందుకోవడం అభినందనీయమని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. లంబాడిల జీవనశైలిపై సీనియర్ జర్నలిస్ట్ ఏళ్ల భయ్యన్న తీసిన ఛాయా చిత్ర్తానికి జాతీయ స్థాయి అవార్డ్ వచ్చిన సందర్బంగా నకిరేకల్ లో ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిశారు. ఈ సందర్బంగా భయ్యన్నను ఎమ్మెల్యే శాలువాతో సత్కారించి అభినందించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయలను ప్రతిబించే మరిన్ని చక్కటి ఛాయాచిత్రాలు తీయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు మెండే వెంకన్న, పోకల కరుణాకర్, చేరుపెల్లి శ్రీనివాస్, ఏళ్ళ వెంకన్నలు పాల్గొన్నారు.