calender_icon.png 22 December, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికార పక్షం x ప్రతిపక్షం

21-12-2025 12:00:00 AM

జూకంటి జగన్నాథం

తెలంగాణలో రెండేళ్ల ప్రజాపాలన పూర్తి చేసుకున్న అధికార కాం గ్రెస్ పార్టీ తమ నాయకుడి మంత్రివర్గ సహచరుల పాలన ఎలా ఉంది అనే ప్రశ్నలను ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేప థ్యంలో పాలనను  కొందరు మెచ్చుకోగా, మరికొందరు పెదవి విరిస్తే.. ఇంకొందరు బాగాలేదని అభిప్రాయం వ్యక్తపరిచారు. ప్రతిపక్ష పార్టీ మాటలకే పరిమితమవుతుందే తప్ప నిర్మాణాత్మకంగా పనిచే యడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. 2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల తర్వాత భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో ఓటమిపై అంతర్మధనం, ఆత్మ పరిశీలన చేసుకున్న దాఖలాలు కనిపించలేదు. అయితే ఆ పార్టీలోని కొందరు ము ఖ్య నాయకులు ఈ నెపాన్ని ప్రజల మీద  నెట్టేయడం విడ్డూరంగా అనిపిస్తున్నది.

పైగా అధికారానికి దూరమై రెండు సంవత్సరాలు కావొస్తుండడంతో పార్టీలో నా యకుల మధ్య లుకలుకలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కనిపిస్తుంది. బీ ఆర్‌ఎస్ పార్టీలోని నాయకుల తమ అంతర్గత ఘర్షణలతో మీడియాకు, పత్రికలకు మేతను.. ప్రజలకు బోలెడు వినోదాన్ని పంచుతున్నారు. దీనికి తోడు తెల్లారిలేస్తే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అధికార పార్టీపై అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా అనిపిస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  వైఖరి వల్ల తమ పదేళ్ల పరిపాలనలో వీళ్లు చేసిన ఘనకార్యాలన్నీ ఇప్పు డు చెప్పకనే చెప్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు తప్ప అసమ్మతిని రాజేయడం లేదు. అంతేకాదు రెండేళ్లుగా ప్రతిపక్ష హో దా పాత్రను గమనించినా, ఆ న విధానాలు, వాదనలు, వైఖరులను లోతుగా పరిశీలించి చూసినా ఆత్మరక్షణ ధోరణే ఎక్కువగా కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

పెరగని గ్రాఫ్..

దేశంలోనే అత్యధిక నిధులు కలిగి ఉన్న పార్టీగా బీఆర్‌ఎస్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. ఆ పార్టీ నాయకులు మాత్రం ఇం కా తమ పాలనలో చేసిన తప్పిదాలను మాత్రం గ్రహించలేకపోతున్నారు. తమ ప్రభుత్వంలో తాము చేసిన తప్పులను అం గీకరించే దశలో కూడా వారు లేరనిపిస్తోంది. పైగా కార్యనిర్వాహక అధ్యక్షుడు తనకు తెలియని విషయాలంటూ ఏమీ లేవంటూ రెట్టించిన అహంతో, హావభావాలతో కనిపిస్తుండడం బాధాకారం. ఒక రాష్ట్రాన్ని పదేళ్ల కాలం పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కుటుంబ సభ్యులు.. ప్రజల దృష్టిలో తమ కుటుంబం అంతర్గత విభేదాలతో కుమ్ములాడుకుంటున్నట్టు చూ పించడంలో విజయవంతమైంది.

ఈ అం శాన్ని మీడియా వేదికగా ప్రజలకు బహిర్గతం చేసి వారికి కావలసినంత వినోదాన్ని పంచడంలో సఫలీకృతులయ్యారు. ఇన్ని చేసినా ఆ పార్టీకి ప్రజల్లో గ్రాఫ్ మాత్రం పె ద్దగా పెరగడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాలకు అందించిన రోశయ్య, బాలసుబ్రమణ్యం  విగ్రహాల ఆవిష్కరణ పరిస్థి తులను ఉపయోగించడంలోనూ బీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైంది. అందివచ్చిన అవకాశాలను రాజకీయంగా వినియోగించుకోవడంలో ఆ పార్టీ ఫెయిలైందని చె ప్పొచ్చు. ఇకపోతే ఆ పార్టీ అధినాయకుడు కేసీఆర్ 2023 ఎన్నికల ప్రచార సభల్లో  తమను ఓడిస్తే విశ్రాంతి తీసుకుంటానని పదే పదే పేర్కొన్నారు. అయితే ఓటమి పా లైన తర్వాత కేసీఆర్ తాను చెప్పిన ఆ ఒక్క మాటను మాత్రం నిలబెట్టుకున్నారనిపిస్తుంది.

అధికార పార్టీ ఆర్భాటాలు..

రెండేళ్ల పాలనను రాజకీయంగా పరిశీలించి చూస్తే.. వీడిని విడిచిపెట్టి వాడిని కట్టేయమన్నట్టుగా ఉంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడిన మాటలకు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయింది. ఎందుకంటే విద్యుత్తు కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పేరు మీద భూముల ఆక్రమణ, చర్లపల్లి జైల్లో అవినీతిపరుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తానని గొప్పలు పలికా రు. గడిచిన రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్షాల మీద కక్ష్య సాధింపు చర్యలు తీసుకోదల్చుకోలేనని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.

ఒక సీఎం పదవిలో ఉన్న వ్య క్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. రాష్ట్రంలో పాలన ఏ విధంగా సాగుతుందనేది తెలంగాణ ప్రజలకు తెలిసినప్పటికీ అ మాయకత్వం ప్రదర్శిస్తుంటారు. కానీ సమ యం, అవకాశం వచ్చినప్పుడు మాత్రం తమ తడాఖా చూపిస్తారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను ఇప్పుడున్న అధికార పార్టీ కూడా చేస్తే ఇంగిత జ్ఞానమున్న రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరన్న విషయాన్ని కాంగ్రెస్ తమ మదిలో ఉంచుకుంటే మంచిది. కేసీఆర్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేవలం మాటల గాంభీర్యం, రాజకీయ చా తుర్యం ప్రదర్శిస్తే మాత్రం తెలంగాణ సా మాన్యులు భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు మాత్రం పక్కాగా స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. తెలంగాణలో గత ప్రజాస్వామ్య రాజకీయ చరిత్రను చూస్తే ఇది విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

హామీలను నెరవేర్చడంలో అ ప్పుల సమస్యలు పేర్కొంటున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసు కుంటున్నారు. అయితే ఎన్నికల మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలాగే ప్రవర్తిస్తామంటే రాబోయే కాలం దీనికి ఒక పరిష్కారం ప్రజల రూ పంలో నిర్ణయిస్తుంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ముందు బీసీ రిజర్వేషన్ల గురించి ఏం మాట్లాడినా చెల్లిపోయింది. సర్పంచ్ ఎన్నికల్లో  గెలుపోటములు సహ జం. అయితే అధికార పార్టీగా ఎక్కువ స్థా నాలు గెలిచామని, తామేదో మేలైన పరిపాలన ప్రజలకు అందిస్తున్నామని భావిస్తే బొక్క బోర్లా పడడం కిందకే వస్తుంది. 

నిజాయితీ నిరూపణ!

ఇప్పటికైనా రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో చేసిన వ్యాఖ్యలు కావొచ్చు.. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు ఎన్నికల్లో చెప్పిన మాటలను నెరవేర్చాల్సిన అవసరముంది. దీనికి విరుద్ధంగా గత పాలకుల్లాగే మీరు కూడా ప్ర జల మనోభావాలతో ఆటలాడితే మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడడం ఖాయం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం విషయంలోనూ ఇదే జరిగింది. మాటలకు కట్టుబడి గత పాలకుల నిర్వాకాలపై తగిన చట్టబద్ధమైన చర్యలు తీసుకొని మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ప్రజలు పాలకుల మార్పు కో రుకున్నప్పుడల్లా వారి బతుకులు ప్రతిసారీ పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ మాదిరిగా తయారవుతుంది. అంతిమంగా అధి కార, ప్రతిపక్ష పార్టీల రెండేళ్ల పనితీరును పరిగణలోకి తీసుకొని చూస్తే ‘హళ్లికి హళ్లి.. సున్నకు సున్నా’ అన్న చందంగా తయారైంది.