calender_icon.png 8 July, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే పల్లెల పురోభివృద్ధి

08-07-2025 12:16:35 AM

సింగిల్ విండో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

రేవల్లి జులై 7: నియోజకవర్గంలోని పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించడం కేవలం కాంగ్రెస్ పార్టీలో సాధ్యమవుతుందని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు, సోమవారం ఆయన డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి మండల కేంద్రం రేవల్లి లో రూ/- 38 లక్షలు PACS నిధుల నుంచి నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్, నాగపూర్ లో 22 లక్షల నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పల్లెలను మనమే అభివృద్ధి చేసుకుందామనీ ఈ క్రమంలోనే నాగపూర్ రేవల్లి మండల కేంద్రాల్లో నిర్మించిన దుకాణ సముదాయాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో సింగల్ విండో సీఈవో రామ్మోహన్, చైర్మన్ లోడే రఘు మండల తహసిల్దార్ లక్ష్మీదేవి ఎంపీడీవో నరసింహ, నాయకులు సత్య శిలా రెడ్డి,సుఖేందర్ రెడ్డి, వాడల పర్వతాలు, బాల్ రెడ్డి, రాములు,సురేష్ గౌడ్ నరసింహ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.