21-01-2025 04:37:23 PM
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష...
పెద్దపల్లి (విజయక్రాంతి): ఇక నుంచి జిల్లాలో సదరన్ సర్టిఫికెట్ కేవలం 24 గంటల్లో పొందవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Shri Harsha) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగులకు క్యాంపుకు హాజరైన తరువాత జారీ చేసే సదరం సర్టిఫికెట్ గతంలో రోజుల తరబడి సమయం పట్టేదని, ఇక నుంచి కేవలం 24 గంటల వ్యవధిలో జారీచేసి అందించడం జరుగుతుందని, ఈ ద్రపత్రాలను కలెక్టరేట్లోని (ఐ.డి.ఓ.సి) జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో 24 గంటల తర్వాత పొందవచ్చని ఈ అవకాశాన్ని జిల్లాలోని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.