calender_icon.png 30 September, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు ఏరియాలో ఘనంగా ఫ్యామిలీడే, సద్దుల బతుకమ్మ సంబురాలు..

29-09-2025 10:36:14 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా ఆధ్వర్యంలో ఫ్యామిలీ డే, సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బ్లాక్ డైమండ్ స్టేడియం, జెకె కాలనీ నందు బతుకమ్మ సంబురాలను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు ఏరియా జిఎం వి.కృష్ణయ్య, సేవా అధ్యక్షురాలు వి.రమ పాల్గొనారు. తదుపరి వారు జ్యోతి ప్రజ్వలన చేసి గౌరీ పూజ నిర్వాహించి సద్దుల బతుకమ్మ పండుగను సాంప్రదాయబద్దంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్రంలో అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక. రంగు రంగుల పూలను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడతారు.

బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగుతుంది.  బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, అభయం, తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చిన గత వెయ్యి ఏళ్లుగా బతుకమ్మను ఇక్కడి ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. ఈ బతుకమ్మపాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. బతుకమ్మ పండుగను మంచి అహల్లాద వాతావరణంలో జరుపుకోవటానికి మరియు గ్రౌండ్ ఆవరణలో బతుకమ్మలను నిమజ్జనానికి తాత్కాలిక నీటి కొలను ఏర్పాట్లను చేయడమైనదని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు కార్మిక కుటుంబాల మహిళలలు తమతో సద్దుల బతుకమ్మలను తీసుకోని వచ్చి ఈ పండుగలో పాల్గొన్నారు. బతుకమ్మలను తిసుకవచ్చిన మహిళలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ, కన్సొలేషన్ ద్వారా ఎంపికైన వారికి నగదు బహుమతులను ఇవ్వటం జరిగింది. హాజరైన మహిళల ఆధ్వర్యంలో ఆటా-పాట కార్యక్రమాలు నిర్వహించారు.