calender_icon.png 30 September, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమల్లోకి ఎన్నికల కోడ్

30-09-2025 12:29:44 AM

కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 29(విజయక్రాంతి):ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున సంబంధిత గ్రామీణ స్థానిక సంస్థల పరిధిలో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్ట ర్ విజయేందిర బోయి  ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ఎన్నికల  ప్రవర్తనా నియమావళిని తు.చా తప్పకుండా పాటించాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆ మె జిల్లా అధికారులతో  మాట్లాడుతూ ఎ న్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం, గ్రౌండింగ్ వంటివి చేయకూడదని తెలిపారు . ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు పక్కగా పని చేయాలని అన్నారు.

జిల్లా అంతటా గ్రామపంచా యతీ, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని చె ప్పారు.    ప్రత్యేకించి ముఖ్యమైన తాగునీరు, వైద్యం వంటి అత్యవసర పనులు కొనసాగుతాయని చెప్పారు. గ్రామపంచాయతీ ఎన్నికలు, ఎంపిటిసి ,జడ్పిటిసి ఎన్నికలను దృ ష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయి వరకు అధికారులు అందరూ సిబ్బంది ఎన్నికల నియమ, నిబంధనలపై పూర్తిగా స్పష్టత కలిగి ఉండాలని ఆదేశించారు.

ఎన్నికల ప్రవర్తనా నియ మావళి అమల్లోకి వచ్చినందున జిల్లా వ్యా ప్తంగా  ఎక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన ,ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోర్డింగులు, కటౌట్లు ,పోస్టర్లు, బ్యానర్లు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. మూ డు దశల గ్రామ పంచాయతీ ఎన్నికలు, రెండు దశలలో జరిగే ఎం .పి. టి .సి.,జడ్. పి.టి.సి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వ రకు   ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని, తెలిపారు. వర్షాల కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉం డి అన్ని జాగ్రత్తలు తీసుకోవా లని సూచించా రు.

శిథిల, పాత భవనాల్లో ఉన్న వాణిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. పొంగి పొర్లుతున్న కాజ్ వే ల  ట్రాఫిక్ వెళ్లకుండావద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.సమావేశంలో రెవె న్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయ క్, జడ్.పి.సి. ఈ.ఓ వెంకట రెడ్డి,ఆర్.డి.ఓ నవీన్,డి.పి.ఓ పార్థ సారథి తదితరులు ఉన్నారు.