calender_icon.png 30 September, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్.. ఎన్నికల సందడికి దూరం

30-09-2025 12:29:33 AM

  1. జిల్లాలో అమలులో లేని నియామవళి 
  2. స్థానిక సంస్థలు, పంచాయతీలు లేకపోవడమే కారణం 
  3. జిల్లాలో అన్ని మున్సిపాలిటీలే

మేడ్చల్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రమంతటా ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికలు జరుగుతాయా అని అనుమానాలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ అనుకూలంగా వచ్చిన వారు పోటీకి సిద్ధమవుతున్నారు. ఎన్నికల నియామవళి కూడా అమలులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది.

జిల్లాలో ఎన్నికల సంద డి లేదు. ఎన్నికల నియమావళి కూడా అమలులో లేదు. జిల్లాలో స్థానిక సంస్థలు, పం చాయతీలు లేకపోవడమే ఇందుకు కారణం. జిల్లాలో గతంలో 61 గ్రామపంచాయతీలు, ఐదు మున్సిపాలిటీలు ఉండేవి. వీటన్నింటినీ పురపాలికల్లో విలీనం చేశారు. జిల్లాలో పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాం తం, మారుమూల గ్రామాలు కూడా ఉన్నాయి.

తక్కువ మండలాలు, పంచాయతీలు ఉండటంతో వీటన్నింటిని తప్పనిసరి పరిస్థితుల్లో పురపాలికల్లో విలీనం చేశారు. జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు, నాలు గు కార్పొరేషన్లు ఉన్నాయి. కూకట్‌పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. 

నేతల్లో తగ్గిన ఆసక్తి 

మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసినా.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా జిల్లాలో నిర్వహణపై  రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రింగ్ రోడ్డు వరకు ఉన్న మున్సిపా లిటీలలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టలేదు.

కొత్త మున్సిపాలిటీలు, గ్రామా లు విలీనమైన మున్సిపాలిటీలలో డీలిమిటేషన్ చేశారు. రింగ్ రోడ్డు వరకు ఉన్న మున్సిపాలిటీలలో డీలిమిటేషన్ చేయనందున ఇవి జిహెచ్‌ఎంసీలో కలుస్తాయని భావిస్తున్నారు. జీహెచ్ ఎంసీలో కలిస్తే 30 40 వేల ఓటర్లకు ఒక డివిజన్ ఉంటుంది. అంటే పదవులు బాగా తగ్గుతాయి.

దీంతో నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రింగ్ రోడ్డు బయట కొత్తగా ఏర్పడిన ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలలో మాత్రమే డీలిమిటేషన్ చేశారు. ఈ మున్సిపాలిటీలు కొనసాగుతాయని భావిస్తున్నారు. మున్సిపల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరకు వీటిపై కూడా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.