calender_icon.png 30 September, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీ కార్మికులకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలి

30-09-2025 12:27:28 AM

వనపర్తి, సెప్టెంబర్ 29 ( విజయ క్రాంతి ) : కొత్తకోట మండలం వడ్డె వాటా గ్రామంలో గ్రామ పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ఫికస్డ్ వేతనం రూ 18 వేలు ఇ వ్వాలని సిఐటియు జిల్లా కోశాధికారి బొ బ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు.

సోమవారం మండల పరిధిలోని వడ్డేవాడ గ్రామంలో గ్రామ కార్యదర్శి మనోహర్ గౌడ్ కు గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో సమస్యలతో కూడినవినతి పత్రం ను అందచేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ జూలై ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని పంచాయతీ కార్మికుల కుటుంబాలలో దసరా పండుగను జరుపుకునేందుకు వెంట నే ప్రభుత్వం పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని  డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు రాములు కమల్ బాలన్న సుజాత చెన్నమ్మ తదితరు లు పాల్గొన్నారు.రేషన్ షాపులలో 9 రకాల నిత్యావసర సరుకులు ప్రభుత్వం అందించాలిరేషన్ షాపుల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని సిఐటియు జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

సోమవారం పట్టణంలోని సిఐటియు కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మా ట్లాడారు. గతంలో బియ్యం, చక్కెర, నూనె, కందిపప్పు, గోధుమలు, ఉప్పు, గోధుమపిండి, చింతపండు, కిరోసిన్ వంటి సరుకు లు అందించేవారని గుర్తు చేశారు. ఈ ఏడా ది దసరా పండుగ నుండి మళ్లీ ఈ పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కే. వెంకటయ్య, పి. రాములు, బి. నర్సింలు, శేఖర్, నాగన్న, రాజు, బాలకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.