calender_icon.png 15 September, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి టెస్టులో గెలిచిన సఫారీలు

01-12-2024 12:00:00 AM

11 వికెట్లతో చెలరేగిన యన్సెన్

డర్బన్: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా 233 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో బవూమా (113), స్టబ్స్ (122) సెంచరీలతో చెలరేగడంతో 5 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సఫారీలు లంకేయులను భారీ స్కోరు చేయనివ్వలేదు. సఫారీ బౌలర్ మార్కో యన్సెన్ రెండు ఇన్నింగ్సులలో కలిపి 11 వికెట్లతో చెలరేగాడు. అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.