23-09-2025 12:58:18 AM
అమీన్ పూర్, సెప్టెంబర్ 22 :సహీల్ క్రికెట్ అకాడమీ విద్యార్థి కుందన్ సాయి కృష్ణ అండర్-14 ఎస్జీఎఫ్ సంగారెడ్డి జట్టుకు ఎంపిక కావడం జిరిగింది. చిన్న వయసులోనే తన ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నట్లు హెడ్ కోచ్ సహీల్ తెలిపారు.
కుందన్ సా యి కష్టపడే తత్వం ఉన్న ఆటగాడని, అతన్ని సరైన సమయంలో ప్రోత్సహిస్తే బాగా రాణిస్తాడని చెప్పారు. కుందన్ సాయి విజయంతో సహీల్ క్రికెట్ అకాడమీకి మరో గౌరవం దక్కిందన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ కుందన్ సాయి కృష్ణ మెరుగైన ప్రదర్శన చేయాలని ఆకాంక్షించారు.