calender_icon.png 23 September, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

23-09-2025 12:59:36 AM

నాగల్ గిద్ద, సెప్టెంబర్ 22: నాగల్ గిద్ద మండలంలోని ఇరాక్ పల్లి మేఘా నాయక్ తండ దేవి దాస్ మహారాజ్ ఆశ్రమంలో భవాని మాత ఆలయం నిర్మించి సోమవారం రోజున విగ్రహ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టాపన కార్యక్రమానికి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆయనతో పాటు కొండాపూర్ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్, మాజీ జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ రవీందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు పండరి, మాజీ సర్పంచ్ శివరాం, బిఆర్‌ఎస్వి అధ్యక్షులు సద్దాం, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సంజు కుమార్, నాగిరెడ్డి, మాజీ ఆత్మ కమిటీ సభ్యులు వెంకట నాయక్, లక్ష్మణ్ నాయక్, వివిధ తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.