calender_icon.png 5 May, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీత దాటితే జీతం కట్..!

05-05-2025 01:25:50 AM

  1. వంద మీటర్లు దాటితే అంతే సంగతులు
  2. వైద్యులకు ఫేస్మార్క్ హాజరు విధానం
  3. మే 1 నుంచే అమల్లోకి..
  4. మెడికల్ కాలేజీ, జీజీహెచ్లో ఏఈజీఏఎస్ విధానం
  5. ప్రత్యేక యాప్, డివైజ్ల ఏర్పాటు

సంగారెడ్డి, మే 4(విజయక్రాంతి):విధులకు డుమ్మా కొట్టే డాక్టర్ల ఆటలు ఇక చెల్లవు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జీజీహెచ్లో హాజరు నమోదు చేసుకోకుండా విధులకు డుమ్మా కొట్టే డాక్టర్లకు చెక్ పెట్టేందుకు కొత్త విధానం అమలు చేస్తున్నారు. మే 1వ తేదీ నుండి కొత్త హాజరు విధానం మొదలవుతోంది.

నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ), ఆధా ర్ ఎనబుల్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్ట మ్ (ఏఈబీఏఎస్)ను తీసుకొచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వవ మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయగా ఉమ్మడి జిల్లాలో కొత్త హాజరు విధానానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

ఫేస్మార్క్ తప్పనిసరి...

ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్ మెడికల్ కళాశాల, జీజీహెచ్లలో విధు లు నిర్వహిస్తున్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, కాంట్రాక్టు వైద్యులు ఎవరైనా సరే ఫేస్ మార్క్ అటెండెన్స్ వేసుకోవాల్సిందే. గత రెండేళ్ళు బయోమెట్రిక్ విధానం అమలు చేయగా, చాలామంది వైద్యులు అటెండెన్స్ వేసుకొని బయటకు వెళ్ళడం సాధారణమైంది.

ప్రధానంగా  ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, సొంత ఆసుపత్రులున్న వైద్యులు వచ్చామా.. పో యామా అన్నట్లు వ్యవహరిస్తున్నారు.  ఇ లాంటి వ్యవహారాలకు చెక్ పెడుతూ ఎన్‌ఎంసీ ఫేస్మార్క్ అటెండెన్స్ తప్పనిసిరి చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా కొత్త విధానంతో వయస్సు రీత్యా వేలిముద్రలు రాక ఇబ్బంది పడుతున్న వైద్యులకు ప్రయోజనం కలుగనుంది. 

మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేయాలి...

వైద్యలందరూ కచ్చితంగా తమ మొబైల్ ఫోన్లలో ఫేస్మార్క్ అటెండెన్స్ యాప్ను డౌ న్లోడ్ చేసుకోవాల్సిందే. ఈ యాప్ జీజీహెచ్, మెడికల్ కళాశాకు 100 మీటర్ల పరిధిలోనే పనిచేస్తుంది. 100 మీటర్లు దాటితే ఫేస్మార్క్ కట్ అవుతుంది. దీంతో ప్రతినిత్యం గంట, నిమిషాల చొప్పున కూడా జీతాల్లో కోత విధించనున్నారు.

దీంతో నిత్యం నిర్ణీత వేళ ల్లో అందుబాటులో ఉండి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎన్‌ంఎసీ అదేశాల మేర కు మెడికల్ కాలేజ్, జీజీహెచ్లో ప్రత్యేకంగా డివైజ్ను ఏర్పాటు చేయనున్నారు. ఫోన్ ద్వారా వీలు కాకుంటే డివైజ్లో ఫేస్మార్క్తో అటెండెన్స్ వేసుకొని విధులు నిర్వర్తించే వెసలుబాటు కల్పించారు. 

డుమ్మాలకు ఆస్కారం ఉండదు...

దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జీజీహెచ్లలో విధులు నిర్వర్తించే ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, వైద్యులందరూ కచ్చితంగా ఫేస్మార్క్ అటెండెన్స్ వేసుకోవాలి. ఢిల్లీలోని ఎన్‌ఎంసీ మానిటరింగ్ చేస్తుంది. సమయపాలనతో పాటు నియమ నిబంధనలు పాటించాలి. లేకపోతే జీతాల్లో కోత పడుతుంది. ఈ విధానం వల్ల డుమ్మాలకు చెక్ పడనుంది. 

 డాక్టర్ సుధామాధురి, ప్రిన్సిపాల్, మెడికల్ కాలేజీ, సంగారెడ్డి