calender_icon.png 5 May, 2025 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాడు అనుమతులు.. నేడు నోటీసులు

05-05-2025 01:28:54 AM

  1. పంచాయతీ, రెవెన్యూ అధికారుల లీలలు
  2. ఇన్నేళ్ళుగా చేతులు తడుపుకున్న అధికారులు
  3. ప్రభుత్వ భూమిలో దర్జాగా నిర్మాణాలు
  4. నెలనెలా కిరాయి రూపంలో ఆదాయం
  5. అసలైన నిరుపేదలకు అన్యాయం

కొండాపూర్, మే 4 : భూమిలేని నిరుపేదలు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం కేటా యించిన భూమిని  కొందరు అక్రమార్కులు దర్జాగా వ్యాపారంగా మల్చుకొని లక్షలాది రూపాయలు దో చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడు స్తూ లబ్దిదారులు ప్రయ త్నిస్తుంటే అందుకు అధికారులు సైతం వత్తా సు పలుకుతున్నా రు. అసలు ప్రభుత్వం సా గు కోసం మంజూరు చేసిన ప్రభుత్వ భూ మిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు.

కానీ సంబంధిత అధికారుల అండదం డల తో అక్రమార్కులు యథేచ్ఛగా భవనా న్ని, వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేసుకున్నా అధికారుల్లో చలనం కలగడం లేదు. కొండాపూర్ మండలం సీహెచ్ కోనాపూర్ గేట్ వ ద్ద గల ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 54లో అదే గ్రామానికి చెందిన వీరేశం యాదవ్కు కొంత భూమిని కేటాయించారు. ఈ భూమి లో కేవలం సాగు చేసుకోవడానికి మాత్రమే వినియోగించాలి. కానీ సదరు లబ్దిదారుడు అధికారుల, నాయకుల అండతో ప్రభుత్వ భూమిలో భవనాన్ని, వాణిజ్య దు కాణాలను ఏర్పాటు చేసి లబ్దిపొందుతున్నారు. 

ఇన్నేళ్ళుగా ఏం చేసినట్లు ?

ప్రభుత్వ సర్వే నంబర్ 54లో వీరేశం యాదవ్కు కేటాయించిన భూమిలో వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేసుకోవడంపై విజయక్రాంతి వెలుగులోకి తేవడంతో స్పందిం చిన పంచాయతీ అధికారులు అతనికి నోటీసును జారీ చేశారు. విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ భూమిలో లబ్దిదారుడు పంట పండిస్తున్నాడా లేదా అనే విషయాన్ని అధికారులు పర్యవేక్షించాలి.

సంబంధిత వ్య వసాయ అధికారుల నుండి సమాచారం తీసుకోవాలి. అలాంటిదేమీ లేకుండా ఏకం గా భవన నిర్మాణాలు చేపడుతున్నా, వాణి జ్య దుకాణాలు ఏర్పాటు చేసినా ఏమీ తెలియనట్లు అధికారులు వ్యవహరించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు నాలుగేళ్ళ క్రితమే ఈ నిర్మాణాలు చేపట్టినా ఇప్ప టి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. 

లబ్దిదారుడు అర్హుడేనా ?

సీహెచ్ కోనాపూర్లో ప్రభుత్వ భూమిని వీరేశం యాదవ్ అనే లబ్దిదారునికి భూమి కేటాయింపు విషయంలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్థికంగా వెనుకబ డిన నిరుపేదలకు మాత్రమే ప్రభుత్వం భూ మిని కేటాయిస్తుంది. ఒకవేళ నిజంగానే అ ర్హుడైతే తాను సాగు చేసుకొని పంట పండించుకోవాలి.

సదరు లబ్దిదారుడు ఇతరత్రా వ్యాపారాలను చేసుకుంటూ ప్రభు త్వం కే టాయించిన ప్రభుత్వ భూమిలో వా ణిజ్య వ్యాపారానికి తెరలేపడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ చేసి ప్రభుత్వ భూమిలో ఎలాంటి అను మతులు ఇవ్వకున్నా అధికారుల అండతో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకొని నిజమైన లబ్దిదారులకు ఆ భూమి ని కేటాయిం చాలని పలువురు  డిమాండ్ చేస్తున్నారు. 

విజయక్రాంతి ఎఫెక్ట్..

కొండాపూర్ మండలం సీహెచ్ కోనాపూర్లో ప్రభుత్వ భూమిలో అక్రమంగా  నిర్మించిన దుకాణాలు, భవనంపై గ్రామ పం చాయతీ అధికారులు స్పందించారు. ఈనెల 3న విజయక్రాంతి దినపత్రికలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు అనే శీర్షికన ప్రచురించిన కథనానికి అధికారులు స్పం దించారు.

ఈ మేరకు లబ్దిదారుడు వీరేశం యాదవ్కు పంచాయతీ సెక్రటరీ ప్రణీత్ నోటీసులను నేరుగా అందించారు. నోటీసు కు స్పందించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని కార్యదర్శి తెలిపారు.