19-05-2025 12:14:24 AM
-వచ్చే వారం నుంచి 5 గ్రామాల్లో రీ సర్వే
-రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): రాష్ర్టంలో నిజాం కాలం నుంచి ఉన్న నక్షాలకు మోక్షం కల్పించబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు.
రాష్ర్టంలో తరతరాలుగా నిజాం కాలం నుంచి సర్వే చేయని లేదా సర్వే రికార్డులు లేని 413 గ్రామాలు ఉన్నాయని, గత పదేళ్లలో ఈ సమస్యకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిష్కారం చూపలేదని విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపాలని నిర్ణయించిందన్నారు. ఇందుకుగాను 413 గ్రామాలకుగా ను 5 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించి దానిలో వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టి మిగిలిన గ్రామాల్లో కూడా చేపడతామని తెలిపారు.
పైలెట్ గ్రామాలు ఇవే
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండ లం సలార్ నగర్, జగిత్యాల్ జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం షాహిద్ నగర్ గ్రామాలను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో ఆధునిక సాంకేతికను వినియోగిస్తూ రెండు పద్ధతుల్లో విస్తృత సర్వే జరుగుతుందని, ఏరియల్/ డ్రోన్ సర్వే పద్ద తి, ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతుల్లో సర్వే చేసి జియో రిఫరెన్డ్స్, క్యాడస్ట్రల్ మ్యాపులు, హక్కుల నమోదు పత్రాలను తయారుచేస్తారని తెలిపారు. ఈ నూతన విధానాలతో భూమి సమాచారం, పారదర్శకత, వివాద పరిష్కారం, భూ యాజమాన్యంలో స్పష్టత వస్తుందని, ఫలితంగా రైతులు, గ్రామీణ భూ యజమానులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు
రీ కోసం నాలుగు సంస్థల ఎంపిక
ఈ రీ కోసం వివిధ రాష్ట్రాల్లో అనుభవం ఉన్న ఆర్వీ అసోసియేట్స్, మార్వెల్ జియో స్పేషియల్, ఐఐసీ టెక్నాలజీస్, నియో జియో, డ్రోగో డ్రోన్ సంస్థలను ఎం పిక చేశామని మంత్రి తెలిపారు. పైలట్ గ్రామాల్లో ఈ సంస్థలు రీ సర్వే చేస్తాయని, సర్వే ఫలితాల ఆధారంగా మిగిలిన గ్రామాలకు విస్తరిస్తామని ఆయన వెల్లడించారు.