19-05-2025 12:15:47 AM
ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాది
మహబూబ్ నగర్ మే 18 (విజయ క్రాంతి) : విద్యార్థులు చదువుతోపాటు కరాటే మార్షల్ ఆర్ట్‌లో రాణించాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాది అన్నారు. జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డు స్కూల్ ఆవరణలో కింగ్ షోటోకాన్ కరాటేడూ ఇండియా ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ ఆధ్వర్యంలో వేసవి ఉచిత కరాటే శిక్షణ శిబిరంలో భాగంగా ఆదివారం విద్యార్థులకు యోగా శిక్షణా శిబిరం నిర్వహించారు.
కార్యక్రమంలో జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ చైర్మన్ మీర్ ఆర్షద్ అలీ, కింగ్ షోటోకాన్ ఫౌండర్ జహంగీర్ పాషా ఖాద్రీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీక్ అహ్మద్ ఖాద్రి, పిఆర్టియు అధ్యక్షులు మొహమ్మద్ అతహర్, కాంగ్రెస్ నాయకుడు ఎండి.జాకీర్, కరాటే మాస్టర్లు నవీన్, ఆర్ష జమీల్, అమాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.