12-10-2025 12:45:22 AM
కామారెడ్డి, అక్టోబర్ 11 (విజయక్రాంతి): అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోబోయిన గ్రామస్థులపై మహారాష్ట్రకు చెందిన ముఠా దాడికి దిగడంతో 9 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామంలో శనివారం జరిగింది. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కొడిచర్ల శివారు ప్రాంతం నుంచి ఇసుకను అక్రమంగా తరలించేందుకు మహారాష్ట్రలోని కమ్మలూరు, సాంఘిమెయిన్, కల్లూరు ప్రాంతానికి చెందిన దాదాపు 50 మంది వచ్చారు.
సిర్పూర్ గ్రామానికి చెంది న కొంతమంది అక్కడకు వెళ్లి ఇసుకను తరలించవద్దంటూ మహారాష్ట్ర మాఫియాతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెచ్చిపోయిన మహారాష్ట్ర ముఠా ఒక్కసారిగా రాడ్లతో దా డులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో సిర్పూర్ గ్రామానికి చెందిన 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా నిజామాబాద్ ప్రభు త్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రాడ్లతో దాడులకు పాల్పడ్డ మహారాష్ట్ర ఇసుక మాఫియాపై పోలీసులు కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కొంతమంది స్థానికు ల అండదండల వల్లే మహారాష్ట్ర అక్రమ ఇసుక మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతుందని ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడం కొసమెరుపు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పోలీసులకు మహారాష్ట్ర ముఠా మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.