calender_icon.png 13 August, 2025 | 7:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈడీ కస్టడీకి సందీప్‌కుమార్

13-08-2025 01:16:55 AM

ఫాల్కన్ ఫ్రాడ్ కేసులో పురోగతి

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.900 కోట్ల ఫాల్కన్ గ్రూప్ మోసంలో ఈడీ కీలక పురోగతి సాధిం చింది. ఈ భారీ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి, కీలక నిందితుల్లో ఒకడైన సందీప్‌కుమార్ జైన్‌ను ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఏడు రోజుల పాటు సందీప్‌ను కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్‌కు చెందిన ఫాల్కన్ గ్రూప్, దాని అనుబంధ సంస్థలు రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో భారీ మోసానికి పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ గ్రూప్ డైరెక్టర్లు, భాగస్వాములు కలిసి భారత్‌తో పాటు విదేశాల్లోని పెట్టుబడిదారుల నుంచి వందల కోట్లు సేకరించి, వాటిని అక్రమంగా తరలించారు. ఈ అక్రమాల్లో సందీప్‌కుమార్ జైన్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ గుర్తించింది.