13-08-2025 01:19:14 AM
గెలిచిన ఏడాదిలోనే రూ. 600 కోట్ల నిధులు
సలహాలు ఇవ్వు.. వ్యక్తిగత విమర్శలు మానుకో..
ఈ ప్రాంత బిడ్డగా నీకు బాధ్యత లేదా..?
అభివృద్ధి జరుగుతుంటే ఓరువలేకపోతున్నారు
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఫైర్
ఆమనగల్లు, ఆగస్టు 12: హైదరాబాద్- శ్రీ శైలం నేషనల్ హైవే ఆరు లైన్ల రోడ్డు తెస్తే క ల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ తరపున ఎ మ్మెల్యేగా తానే ముందుకొచ్చి బీజేపీ నాయకుడు టి.ఆచారిని ఘనంగా సన్మానిస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్ర కటించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోనే రూ. 600 కోట్ల పైగా నియోజకవర్గానికి అ భివృద్ధి నిధులు తీసుకొచ్చానని తెలిపారు.
అభివృద్ధి విషయంలో తాను చర్చకు రెడీ అ ని సవాల్ విసిరారు. మంగళవారం ఆమనగల్ మున్సిపాలిటీలో అమృత్ స్కీం కింద మంజూరైన రూ.32కోట్ల అభివృద్ధి పనులకు అధికారులు, పార్టీ నేతలతో కలిసి పైపు లైన్లు, 5 ఓహెచ్‌ఆర్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజకవ ర్గంలో బీజేపీ నేతలు ప్రాంత అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేకపోతున్నారని ఆయన వి మర్శించారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమనగల్లు మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆ యన గుర్తుచేశారు. మున్సిపాలిటీలో వివిధ శాఖల ద్వారా మంజూరైన నిధులతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు ఆ యన చెప్పారు.
కల్వకుర్తి నియోజకవర్గం గత ఎన్నికల్లో తనించిన హామీల మేరకు అన్నివర్గాల ప్రజలు పార్టీల అతీతంగా అభివృద్ధి సంక్షేమాలు అందిస్తున్నానని ఆయన గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిలోనే నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవం త్ రెడ్డి, మంత్రుల సహకారంతో రూ.600 కోట్ల పైగా నిధులు తీసుకొచ్చే అభివృద్ధి ప నులు చేయిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం ప్రజలపై అభిమానం ప్రేమతో, ఈ ప్రాంత బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తిపై వరాల జల్లు కురిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆచారి విజ్ఞతకే వదిలేస్తున్నా..
కల్వకుర్తి నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేస్తున్న బీజేపీ ప్రతిపక్ష నేత ఆచారి త నను వ్యక్తిగతంగా దూషిస్తూ విమర్శలు చేస్తున్నారని.... అది ఆయన విజ్ఞతకే తాను వది లేస్తున్నానని చురకలు అంటించారు. అభివృద్ధి విషయంలో సలహాలు ఇస్తే ఈ ప్రాం త బిడ్డగా స్వీకరిస్తానని కానీ తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడితే సహించేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తా ను రాజకీయాలకు వచ్చిందే ప్రజలకు సేవచేసే ఎందుకని తన కర్తవ్యం ఎట్టి పరిస్థితుల్లో మరువబోనని అన్నారు. ప్రతిపక్ష నేతగా అ భివృద్ధి విషయంలో ప్రశ్నించు. తప్పులేదు గాని అదే పనిగా వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊ రుకోబోనని హెచ్చరించారు. శ్రీశైలం హైవే కోసం నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్గరీని ప్రత్యేకంగా కలిసి ఆరు లైన్ల రోడ్డును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తుచేశా రు.
మీరు ఈ ప్రాంత బిడ్డవే కదా ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని వెంటబెట్టుకొని శ్రీశైలం హై వేను ఆరు లేన్లగా మంజూరు చేయిస్తే కల్వకుర్తి పార్టీ నుంచి ఏర్పాటు వద్దకే వచ్చి నీకు ఘనస్వాగతం చెప్పి నియోజకవర్గంలో పెద్దఎత్తున సన్మానం ఏర్పాటుచేస్తామన్నారు. కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మోడల్ గా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పిసిసి స్పోక్స్ పర్సన్ బాలాజీ సింగ్, టీపీసీసీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు సు ద్ధపల్లి వెం కటేష్ గౌడ్, హనుమ నాయక్ శ్రీనివాస్ రెడ్డి, జగన్, మానయ్య, కిషన్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి, అనంతరెడ్డి,కేశవులు, శ్రీనివాస్ రెడ్డి, బిచ్చనాయక్, ప్రభాకర్ రెడ్డి, కొండల్ రెడ్డి, జగన్ గౌడ్,రమేష్ గౌడ్, మహేందర్ గౌడ్, కర్ణాకర్ గౌడ్, విజయ్ లు పాల్గొన్నారు.