29-12-2025 02:11:06 AM
గార్బేజ్ పాయింట్ల స్థానంలో సెల్ఫీ పాయింట్లు
ప్రతి పనికీ జియో ట్యాగింగ్
రంగంలోకి ప్రత్యేక బృందాలు
కమిషనర్ ఆర్‌వి కర్ణన్ వెల్లడి
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ నగర చరిత్రలోనే తొలిసారిగా బల్దియా యంత్రాంగం ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ ఆదేశాల మేరకు డిసెంబర్ 29 నుంచి జనవరి 31 వరకు.. అంటే 33 రోజుల పాటు నిరంతరాయంగా మెగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొనసాగనుంది. విస్తరించిన నగరంలోని ప్రతి అంగుళాన్ని శుభ్రం చేయడమే లక్ష్యంగా అధికారులు సమగ్ర కార్యాచరణను రూపొందించారు. శాస్త్రీయ పద్ధతిలో నగరాన్ని శుభ్రం చేసేందుకు అధికారులు మైక్రో ప్లానింగ్ చేశారు. ఏ రోజు, ఏ ప్రాంతంలో ఏ పని చేయాలి అనేదానిపై స్పష్టమైన షెడ్యూల్ ఖరారు చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల శుభ్రతతో ఈ డ్రైవ్ ప్రారంభం అవుతుంది.
మెట పై, లిఫ్టుల వద్ద ఉన్న చెత్తను, దుమ్మును తొలగిస్తారు. నగరంలోని అన్ని ఫ్లు ఓవర్లను శు్ర భం చేస్తారు. రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన ఇసుక, మట్టిని తొలగిస్తారు. డివైడర్లు, సెంట్రల్ మీడియన్ల మధ్య ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేస్తారు. వర్షాకాలం తర్వాత నాలాలు, చెరువుల గట్టున పేరుకుపోయిన చెత్తను, వ్యర్థాలను తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేస్తారు. రోడ్లకు అడ్డంగా, నెలల తరబడి వదిలేసిన పాత వాహనాలు, తోపుడు బండ్లను గుర్తించి వాటిని సీజ్ చేసి తరలించనున్నారు. చెత్త నిల్వ ప్రాంతాలను ఈ డ్రైవ్లో శాశ్వతంగా తొలగించనున్నారు. కేవలం చెత్త ఎత్తేయడమే కాకుండా.. మళ్లీ అక్కడ ఎవరూ చెత్త వేయకుండా ఆ ప్రాం తాన్ని సుందరీకరించ నున్నారు.
ముగ్గులు వేసి, గోడలపై అందమైన పెయింటింగ్స్ వేయిస్తారు. అవసరమై న చోట పూల మొక్కలు నాటి, ఆ ప్రాంతాన్ని సెల్ఫీ పాయింట్‌గా మారుస్తారు. రోడ్లపై చెత్త వేసినా, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసినా, పాన్ పరాక్ ఉమ్మినా అక్కడికక్కడే భారీ జరిమానాలు విధిస్తారు. రోడ్ల పక్కన, ఫుట్పాత్లపై అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను డంప్ చేస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ పెనాల్టీలు వేయనున్నారు. దుకాణాల ముందు చెత్త బుట్టలు లేకుం డా రోడ్డుపై చెత్త వేసే వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. ప్రతి జోన్లోనూ చేపట్టిన పనులను ఫోటోలు తీసి, జియో-కోఆర్డినేట్లతో సహా గూగుల్ షీట్లలో ఎప్పటికప్పు డు అప్లోడ్ చేయాల్సి ఉం టుం ది.
కమిషనర్ కార్యాల యం నుంచే నేరుగా ఈ పనులను మానిటరింగ్ చేస్తారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జీవీపీ పాయింట్ల పరిస్థితి ని సమీక్షిస్తారు. కేవలం యంత్రాంగం మాత్ర మే చేస్తే సరిపోదని, ప్రజలు కూడా భాగస్వాములు కావాలని జీహెఎంసీ పిలుపుని చ్చిం ది. పాఠశాలల్లో విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయిస్తారు. పాత పుస్తకాలు, బట్టలు, బొమ్మలను సేకరించి పునర్వినియోగం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ మెగా డ్రైవ్ను విజయవంతం చేసి, హైదరాబాద్ను దేశంలోనే ఆదర్శవంతమైన నగరంగా నిలబెట్టాలని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ నగర పౌరులను కోరారు. కాగా మీ ప్రాంతంలో చెత్త పేరుకుపోయినా, ఎవరైనా బహిరంగంగా చెత్త వేస్తున్నా పౌరులు ఫిర్యాదు చేయవచ్చు. మైజీహెఎంసీ యాప్ ద్వారా ఫోటో తీసి పంపొచ్చు. ట్వీట్ చేయవచ్చు. 040-21111111 నంబర్‌కు కాల్ చేయవచ్చు.