calender_icon.png 29 December, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పబ్‌లో డ్రగ్ పార్టీ

29-12-2025 02:08:58 AM

జూబ్లీహిల్స్ క్వెక్‌ఎరీనా పబ్‌లో ఈగల్ టీం ఆకస్మిక దాడులు

డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు

8 మందికి పాజిటివ్.. అరెస్ట్ 

పబ్ నిర్వాహకులపై కేసు నమోదు

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 28 (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల సందడి మొదలుకాకముందే హైదరా బాద్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన ప్రత్యేక విభాగం ఈగల్ టీమ్ ఆదివారం మధ్యా హ్నం నగరంలోని పలు పబ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. జూబ్లీహిల్స్ పరిధిలోని క్వెక్‌ఎరీనా పబ్‌లో డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఈగల్ టీమ్ మెరుపు దాడి చేసిం ది. ఈ తనిఖీల్లో 8 మంది యువకులు డ్రగ్స్ తీసుకు న్నట్లు నిర్ధారణ అయింది. సాధారణంగా పబ్లలో రాత్రి వేళల్లో తనిఖీలు జరుగుతుంటాయి. కానీ, పోలీసుల వ్యూహా న్ని మార్చి ఆదివారం మధ్యాహ్నమే దాడులకు దిగడంతో పబ్ నిర్వాహకులు, పార్టీలో ఉన్న యువత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఈగల్ టీమ్ పబ్‌లోకి ప్రవేశించగానే ఎగ్జిట్ డోర్లు మూసివేసి, సంగీతాన్ని ఆపివేశారు. అనుమానాస్పదంగా కనిపించిన యువకులను, తూలుతున్న వారిని పక్కకు తీసుకెళ్లి విచారించారు. వారి కళ్లను, ప్రవర్తనను పరిశీలించిన పోలీసులు.. డ్రగ్ డిటెక్షన్ కిట్ల ద్వారా మూత్ర పరీక్షలు నిర్వహించారు. పబ్‌లో ఉన్న వారిలో సుమారు 20 మందికి పైగా అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా.. వారి లో 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలిం చారు. వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పబ్‌లో ఎవరైనా పెడ్లర్లు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్సుజ్ శాఖ కమిషనర్లు ఇప్పటికే హెచ్చరించారు. తాజా ఘటనతో ఈ పబ్ లైసెన్స్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.