calender_icon.png 12 July, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేడీ ది డెవిల్ కొత్త సబ్జెక్టుతో రూపొందిన చిత్రం

12-07-2025 12:16:34 AM

కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా హీరోగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాత వెంకట్ కె. నారాయణ నిర్మించిన చిత్రం ‘కేడీ ది డెవిల్’. ఈ సినిమాను ప్రేమ్ తెరకెక్కించారు. ఈ మూవీలో రీష్మా నానయ్య హీరోయిన్ గా నటించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి వంటి వారంతా ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాం ఈవెంట్‌లో కథానాయకుడు ధ్రువ సర్జా మాట్లాడుతూ.. “కేడీ’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాకు సంజయ్ దత్ అంటే ఎంతో ఇష్టం. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. శిల్పాశెట్టి వంటి యాక్టర్లతో పని చేయడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. సెట్స్ మీద ఆమె మా యాక్టింగ్‌ను కరెక్ట్ చేస్తుంటారు. రీష్మా మంచి నటి” అన్నారు. కథానాయిక రీష్మా నానయ్య మాట్లాడుతూ.. ‘ఈ మూవీ నాకెంతో ప్రత్యేకం.

ఈ చిత్రంలో అన్ని పాత్రలు డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. చాలా కొత్త సబ్జెక్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది’ అన్నారు. దర్శకుడు ప్రేమ్ మాట్లాడుతూ.. “నాకు కన్నడ మాత్రమే వచ్చు. తెలుగు అర్థం అవుతుంది. కానీ మాట్లాడటానికి రాదు. తెలుగులో ఎక్కువగా చిత్రాలు చూస్తుంటాను. చిరంజీవి ఇంటికి తరుచూ వెళ్తుంటా” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంజయ్ దత్, శిల్పా శెట్టి, కేవీఎన్ ప్రొడక్షన్ బిజినెస్ హెడ్ సుప్రిత్ పాల్గొన్నారు.