12-07-2025 12:15:44 AM
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): రాష్ర్టంలోని సర్కారు జూని యర్ కాలేజీల్లో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించారు. సర్కారు బడుల్లో పారిశుధ్యాన్ని ఈ కమిటీలకే అప్పగించగా, తాజాగా ఇప్పుడు సర్కారు కాలేజీల పారిశుధ్య నిర్వహణకు అప్పగించారు. ఇదివరకే జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి కొత్తగా కాలేజీల కమిటీలను ఏర్పా టు చేయాలని శుక్రవారం అధికారులకు ఆదేశాలిచ్చారు.
పారిశుధ్య నిర్వహణకు కాలేజీలకు ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్‌ను మంజూరు చేశారు. ఏడాదిలో 11 నెలలకు నిధులు కేటాయిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ నిధులను ఇవ్వనున్నారు. రా ష్ర్టంలోని 430 జూనియర్ కాలేజీలకు రెండు నెలల నిధులు రూ. 95. 62 కోట్లను కాలేజీ ప్రిన్సిపాల్ అకౌంట్లల్లో జమ చేసినట్లు ఇంటర్ విద్యా డైరెక్టర్ కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు. జూన్, జూలై మాసాల నిధులను విడుదల చేశామన్నారు.