11-11-2025 10:27:01 PM
ఎంపిఓ సత్యనారాయణ..
మందమర్రి (విజయక్రాంతి): గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని మండల పంచాయతీ అధికారి ఎం సత్యనారాయణ సూచించారు. గ్రామ పంచాయతీ ఇన్స్పెక్షన్ యాప్ లో భాగంగా మంగళవారం ఆయన మండలంలోని అందుగుల పేట గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించి, తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని, గ్రామంలో ప్లాస్టిక్ కవర్లు లేకుండా చూసుకోవాలని, మురికి కాలువలు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అదేవిధంగా గ్రామపంచాయతీ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో నీటి సరఫరా, శానిటేషన్ కు సంబంధించిన 7 రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి వీరేందర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.