28-09-2025 12:55:29 AM
-కరూర్‌లో తొక్కిసలాట
-38 మంది మృతి, మృతుల్లో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు
-విషయం తెలిసి ప్రసంగం మధ్యలోనే ఆపేసి నీళ్ల బాటిళ్లు అందించిన విజయ్
-రిటైర్డ్ జడ్జితో విచారణ కమిటీ
-రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
-తొక్కిసలాట ఘటనతో హృదయం ముక్కలైందన్న విజయ్
-మృతుల కుటుంబాలకు 10 లక్షలు, క్షతగాత్రులకు లక్ష చొప్పున పరిహారం: సీఎం స్టాలిన్
కరూర్, సెప్టెంబర్ 27: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ ప్రచారసభలో తొక్కిసలాట జరిగింది. శనివారం కరూర్‌లో జరిగిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట వల్ల 38 మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 8 మం ది చిన్నారులు, 16 మంది మహిళలు ఉన్నట్టు సీఎం స్టాలిన్ ధ్రువీకరించారు. తొక్కిసలాట విషయం తెలిసిన వెంటనే విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. తొక్కిసలాటలో గాయపడ్డ వారికి స్వయం గా మంచినీళ్లు అందించారు.
మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించి.. పరిస్థితి గురించి తెలుసుకు న్నారు. తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత పార్టీ అధ్యక్షుడు విజయ్ తిరుచిరాపల్లి విమానాశ్రయంలో మీడియా కంటపడ్డారు. తొక్కిసలాటలో మృతి చెంది న వారి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వను న్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘ టనపై దర్యాప్తు చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జ స్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో కమిటీని నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రక టించింది. తొక్కిసలాట ఘటనపై టీవీకే అధినేత విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఈ ఘటనతో నా హృదయం ముక్కలైంది. భరించలేని, వర్ణించలేని బాధలో ఉన్నాను. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను’ అని విజయ్ ట్వీట్ చేశారు.
కొట్టొచ్చిన నిర్లక్ష్యం
విజయ్ కరూర్ ప్రచారసభలో నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఈ ప్రచారసభలో పాల్గొనేందుకు కేవలం 10,000 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇవ్వగా.. 50 వేలకు పైగా తరలివచ్చారు. లైట్ హౌస్ రౌండ్‌టానా సమీపంలో ఉన్న 1.2 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంతో ఉన్న స్థలం 60వేల మందికి సరిపోతుందని తమ పార్టీ సభకు కేవలం 10వేల మంది మాత్రమే వస్తారని అంచనా వేస్తున్నట్టు పోలీసులకు తెలిపింది. నటుడు విజయ్ కూడా సభకు ఏడు గంటలు ఆలస్యంగా హాజరయ్యారు. విజయ్ అక్కడికి చేరుకునే సమయానికే అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడ గుమిగూడారు. రద్దీతో పాటు ఉక్కపోత వల్ల కూడా అనేక మంది స్పృహ కోల్పోయారని, పరిస్థితిని గమనించిన విజయ్ స్పృహ కోల్పోయిన వారికి తన వాహనంలో ఉన్న వాటర్ బాటిళ్లను అందించే ప్రయత్నం చేశారు. దీంతో కూడా తొక్కిసలాట చోటు చేసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి
కరూర్ విషాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం ఎక్స్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని అధికా రులను ఆదేశించా. వైద్యులు, పోలీసులకు సహకరించాలని కరూర్ పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని పేర్కొన్నారు. హోం మంత్రి అమిత్‌షా తమిళనాడు గవర్నర్, సీఎంకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను సీఎం స్టాలిన్ ఆదివారం పరామర్శించనున్నారు.