28-09-2025 12:25:00 AM
నాగర్‌కర్నూల్,(విజయక్రాంతి): పట్టణంలో జొన్న రొట్టెలు విక్రయించే చిరు వ్యాపారుల షాపులను ఆదివారం మున్సిపాలిటీ సిబ్బంది ఆకస్మాత్తుగా తొలగించడాన్ని బహుజన సమాజ్ పార్టీ మాజీ ఈ సి మెంబరు పృద్విరాజ్, నాయకులు కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్‌కు బాధితులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. వ్యాపారుల జీవనాధారంపై ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తక్షణమే వారి కట్టెల షాపులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వ్యాపారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.