calender_icon.png 13 December, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణికి కొత్త బాస్...?

13-12-2025 04:53:54 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలనలో నవీన్ మిట్టల్..

సోషల్ మీడియాలో వైరల్ గా ప్రచారం..

గోదావరిఖని (విజయక్రాంతి): తెలంగాణ కొంగు బంగారం.. అతిపెద్ద భారీ పరిశ్రమ సింగరేణి సంస్థకు కొత్త బాస్ రాబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలనలో నవీన్ మిట్టల్ పేరు ఉన్నట్లు తెలిసింది. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సింగరేణి సంస్థ సీ అండ్ ఎండిగా(ఐఆర్ఎస్) అధికారి అండ్ బలరాం నాయక్ వ్యవహరిస్తున్నారు. 2024 జనవరి 2న ఆయన సింగరేణి సీ అండ్ ఎండిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం సింగరేణి సంస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు.

బొగ్గు ఉత్పత్తి రంగంలోనే కాకుండా ఇతర వ్యాపార రంగాలలో కూడా సింగరేణి సంస్థ అడుగు పెట్టేందుకు విప్లవాత్మక సంస్కరణలకు రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో సంస్థ కొత్త సీ అండ్ ఎండ్ చైర్మన్ గా నవీన్ మిట్టల్ ను నియమిస్తారని శనివారం నాడు సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ గా మారాయి. ఈ విషయంలో సింగరేణి సంస్థ అధికార వర్గాలు సైతం చెప్పకనే చెబుతుండడంతో మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుకు కారణం ఏమై ఉంటుందని అప్పుడే సంస్థవ్యాప్తంగా అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.