calender_icon.png 17 November, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు ఢీకొని పారిశుద్ధ్య కార్మికుడు మృతి

29-07-2024 01:26:30 AM

మెదక్, జూలై 28 (విజయ క్రాంతి): కారు ఢీకొని పారిశుద్ధ్య కార్మికుడు మృతిచెందిన ఘటన మెదక్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మెదక్‌లోని వడ్డెర కాలనీ పెట్రోల్ బంక్ వద్ద పారిశుద్ధ్య పను లు చేస్తున్న మక్తభూపతిపూర్ గ్రామానికి చెందిన కర్రె పోచయ్య (50) అనే కార్మికుడిని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కారు నడుపు తున్న యువకుడు, అతని స్నేహితులు పరారైనట్లు స్థానికులు తెలిపా రు. సమాచారం అందుకున్న మెదక్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మైసయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.