calender_icon.png 14 January, 2026 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఐఐఎంసీ’లో ఘనంగా సంక్రాంతి

13-01-2026 12:00:00 AM

స్వామి వివేకానంద జయంతి 

ఖైరతాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): ఐఐఎంసి కళాశాలలో సంక్రాంతి సాహితీ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులకు ముగ్గుల పోటీలను, నెయిల్ ఆర్ట్, హెయిర్ స్టైల్ పోటీలను నిర్వహించారు. ముగ్గుల పోటీలలో 100 మంది విద్యార్థులు జట్లుగా ఉత్సాహంగా పాల్గొన్నారు. తదనంతరం గెలుపొందిన వారు బహుమతులు గెలుచుకున్నారు. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవంలో భాగంగా కళాశాల చైర్మన్ వంగపల్లి విశ్వనాథం పవర్ ఆఫ్ థాట్స్ అనే అంశంపై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.

విద్యార్థులు ఎన్నో నైపుణ్యాలను పెంపొ ందించుకొని విద్యతోపాటు సమాజం పట్ల అవగాహనతో ఉండాలని చెప్పారు. కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ మాట్లా డుతూ విద్యార్థులకు విద్యతోపాటు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే విధంగా కళాశాలలో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేశారు. అదేవిధంగా మేరా యువభారత్, కళాశాల జాతీయ సేవా పథక యూనిట్ 1, 2 ఆధ్వర్యంలో బుద్ధభవన్‌లో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ ర్యాలీ, ప్రోగ్రాంలో జాతీయ సేవా పథక విద్యార్థులు, ప్రోగ్రాం ఆఫీసర్ పాల్గొన్నారు.