calender_icon.png 14 January, 2026 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘టీసీఎస్’ రూల్స్ కఠినతరం

14-01-2026 01:47:03 AM

వారంలో 5 రోజులు ఆఫీసు అటెండెన్స్ తప్పనిసరి

న్యూఢిల్లీ, జనవరి 13: భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ సంస్థాగత సంస్కరణలను వేగిరం చేసింది. ఆర్థిక మందగమనం, ఏఐ ప్రభావాల రీత్యా 2025లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. అయితే.. ఇతే ఎత్తుపల్లాలు 2026లోనూ ఎదురవుతుందా.. అన్న ప్రశ్న కంపెనీ ఉద్యోగుల్లో మొదలైంది. గడిచిన ఆరు నెలల్లో సంస్థ 30,000 మందికి ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో మరి సంస్థ ఎలాంటి నిర్ణయాలు తీసుకోందనే అంశంపై కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్నుమల్ స్పష్టతనిచ్చారు. ఉద్యోగులు వారంలో 5 రోజులు ఆఫీసుకు రాకపోయినా, వారి పనితీరు బాగలేకపోయినా ఉపేక్షించమని తెలిపారు.