calender_icon.png 13 January, 2026 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వండుగలను ఐక్యతతో జరుపుకోవాలి

13-01-2026 12:00:00 AM

 మాజీ మంత్రి హరీష్ రావు

మొయినాబాద్, జనవరి 12 (విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాలలో పండుగలను కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్నగర్ గ్రామంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో ఆయన పాల్గొని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన బిందు రెడ్డి, చెన్నా రెడ్డిలు మాజీ మంత్రి హరీష్ రావును ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పూజలు చేసిన హరీష్ రావు మాట్లాడుతూ, దేవాలయాలలో భక్తులందరూ దేవుడికి సమానమేనని, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించినప్పుడే భక్తులకు మనశాంతి, ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో దేవాలయాలలో భక్తులు కులమతాలకు అతీతంగా ఎంతో భక్తిశ్రద్ధలతో పండుగలను జరుపుకుంటారని ఆయన గుర్తు చేశారు. అజీజ్నగర్ గ్రామంలో రెండు సంవత్సరాలకు ఒకసారి బోనాల సంబరాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుండటం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిందు రెడ్డితో పాటు చెన్నా రెడ్డి, మాజీ సర్పంచ్ మంగ రాములు, గ్రామ యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అజీజ్నగర్ బోనాల సంబరాలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా వైభవంగా ముగిశాయి.