11 April, 2026 | 5:18 AM

మీ విజయం అద్భుతం

06-11-2025 12:00 AM

ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టును ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత చక్కని పోరాటపటిమ ప్రదర్శించి వరల్డ్‌కప్ గెలవడం అద్భుతమని కితాబిచ్చారు. ఎంతోమందికి ఈ విజయం స్ఫూర్తిగా నిలుస్తుందని మోదీ ప్రశంసించారు.ఈ సందర్భంగా మోదీకి భారత మహిళల జట్టు స్పెషల్ జెర్సీని అందజేసింది.