calender_icon.png 2 May, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాన్వి హవా

23-04-2025 01:02:48 AM

కరీంనగర్ క్రైమ్, ఏప్రిల్22: కరీంనగర్ రేకుర్తి సాన్వి జూనియర్ కళాశాల -డిఫెన్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత శాతంతో పాటు రాష్ట్ర స్థాయి ఉత్తమ మార్కులు సాధించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో రాచకొండ రాజు 985, పల్లె శివరాం 975 మార్కులు, ప్రథమ సంవత్సరంలో ఎం పి సి లో పనస అజయ్ 464, దిడ్డి అభినయ్ 459, సీఈసిలో దూలం సిద్దార్థ 474 మార్కులు సాధించి ప్రథమ స్థానాల్లో నిలిచారు.

అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ ఎర్రంశెట్టి మునిందర్ విద్యార్థులను వేరువేరుగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఎర్రంశెట్టి మునిందర్ మాట్లాడుతూ సాన్వి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ తో పాటు డిఫన్స్ ఉద్యోగాలకు సిద్ధమవుతూనే ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించడంతో పాటుగా,  ఐఐటీ వంటి పోటీ పరీక్షలలో కూడా ప్రతిభ కనబరచడం గర్వకారణంగా ఉందన్నారు.  కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మోహన్ జనార్దన్, నవీన్ జగదీశ్వర్, మమతా  పాల్గొని విద్యార్థులను అభినందించారు.