02-05-2025 01:58:24 AM
బస్టాండ్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, మే 1 (విజయక్రాంతి): 15 రోజుల్లో బస్టాండ్‌ను ప్రారంభిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి కేంద్రంలో నిర్మిస్తున్న నూతన బస్టాండ్ నిర్మాణ పనులను ఎంతవరకు వచ్చాయో సదరు కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకు న్నారు. ఎట్టి పరిస్థితుల్లో 15 రోజుల్లో ప్రారంభించడానికి సిద్ధం కావాలని గుత్తేదారుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశించారు. అంతేకాకుండా ఆగిపోయిన బస్టాండ్ నిర్మాణ పనులు, ఆస్పత్రి నిర్మాణ పనుల కోసం ప్రత్యేకంగా ఆర్థిక మంత్రితో మాట్లాడి నాలుగు కోట్ల నిధులు విడుదల చేయించడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.