calender_icon.png 2 May, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలి

02-05-2025 01:58:30 AM

  1. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలి 
  2. అబ్కారీశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానావాజ్ ఖాసీం 

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): తెలంగాణను డ్రగ్ ప్రీ రాష్ట్రంగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానావాజ్ ఖాసీం పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా షానావాజ్ ఖాసీం గరువారం అబ్కారీ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించగా, ఇన్‌చార్జి అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ ఖురేషి, జాయింట్ కమిషనర్ కేఏబీ శాస్త్రీ, ఇతర సిబ్బంది స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఖాసీం మాట్లాడుతూ.. నార్కొటిక్ డ్రగ్స్, సైకోట్రాపిక్ పదార్థాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న డ్రైవ్‌కు కొనసాగించాలన్నారు. శాస్త్రీయ దర్యాప్తు విధానాలను అనుసరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆయన సూచించారు.

శిక్షా రేటును పెంచి నేరస్తుల్లో భయాన్ని కలిగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మద్యాన్ని నిర్మూలించాలని, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అరికట్టాలన్నారు. కల్లును కల్తీ చేసేందుకు ఉపయోగించే ముడి కల్తీ పదార్థాల వినియోగాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని షానావాజ్ ఖాసీం సూచించారు.