calender_icon.png 16 August, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి సీఎం కప్-2024

03-10-2024 12:00:00 AM

ప్రారంభించనున్న సీఎం రేవంత్

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): పల్లెల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రపంచ చాంపియన్లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సీఎం కప్-2024 నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి 33 జిల్లాల్లో క్రీడాజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఎల్బీ స్టేడియంలో నేడు క్రీడాజ్యోతి టార్చ్ రిలేను ప్రారంభించనున్న సీఎం రేవంత్ లోగో మస్కట్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం 2023లో గోవాలో జరిగిన జాతీయ క్రీడల్లో విజేతలుగా నిలిచిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు పురస్కారాలను అందించనున్నారు. కాగా క్రీడా జ్యోతి 16రోజుల్లో 33 జిల్లాల్లో పర్యటించి చివరగా హైదరాబాద్‌కు రానుంది. కార్యక్రమంలో సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి, తదితరులు పాల్గొన్నారు.