06-12-2025 12:00:00 AM
చింతల్ టాణ సర్పంచ్ అభ్యర్థి మృతితో గ్రామంలో విషాదం
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 05 (విజయ క్రాంతి): ప్రజా సేవ చేయాలనే తపనతో, ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్ర చారాన్ని హోరెత్తించిన ఓ అభ్యర్థి. గెలుపుకు ఒక్క అడుగు దూరంలో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందడం చింతల్ టాణ గ్రామంలో తీవ్ర విషాదానికి దారితీసింది.
వేములవాడ అర్బన్ మండలం, చింతల్ టాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెర్ల మురళి గుండెపోటుతో కన్నుమూశారు. ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఎంత ఉత్సాహంగా నిన్నటి వరకు ప్రచారం నిర్వహించిన చెర్ల మురళి, గ్రామస్తులకు ప్రజాసేవ చేసేందుకు ఎన్నో కళలు కన్నారు.
గ్రామాభివృద్ధికి మెరుగైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్న మురళి అర్ధాంతరంగా మృతి చెందడంతో గ్రామంలోతీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమరం తుది దశకు చేరుకున్న తరుణంలో, అభ్యర్థి మరణించడం ఎన్నికల వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఉత్సాహంగా సాగుతున్న ప్రచార పర్వం ఒక్కసారిగా విషాదమయంగా మారింది..