calender_icon.png 9 December, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం

09-12-2025 02:03:08 AM

సిద్దిపేట రూరల్, డిసెంబర్ 8: పంచాయతీ ఎన్నికల్లో బాండ్ పేపర్ ట్రెండ్ నడుస్తోంది. రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో బక్క రాణి-శ్రీనివాస్ అనే సర్పంచ్ అభ్యర్థి వినూత్నంగా ప్రచారం చేస్తూ గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకుంటు న్నారు. గ్రామ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రామ మేనిఫెస్టోను రూపొందించారు. అందులోని 30అంశాలు గ్రామం లోని యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

గ్రామ మేనిఫెస్టోతో పాటు బాండ్ పేపర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న ఆస్తుల కంటే ఐదేళ్లలో ఒక్క రూపాయి పెరిగిన గ్రామ పంచాయతీకి జప్తి చేసుకునే అధికారం ఉందని, గ్రామ సర్పంచ్‌గా గెలిచిన వెంటనే ముదిరాజ్, రజక, గంగపుత్ర సంఘాలకు చెందిన వార్డు సభ్యుల్లో ఒకరిని ఉప సర్పంచ్‌ను చేస్తానని హామీనిచ్చారు. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అలాగే రాజకీయ వ్యవస్థ బ్రష్టు పట్టిపోయిందని, బ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థను కడిగేయడానికి మందు, మాంసం, డబ్బులు పంచబోనని ప్రచారం చేయడం మరింతగా ఆకర్షిస్తుంది.