23-12-2025 01:03:24 AM
చిట్యాల, డిసెంబర్ 22(విజయ క్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ చెందిన శివనేని గూడెం పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ ను అక్కడినుండి వేరొక చోటికి మార్చాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు సోమవారం గ్రీవెన్స్ డే లో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దీనిపై త్వరలోనే చర్యలు తీసుకొని వీలైనంత త్వరలో వేరొక చోట ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
అనంతరం సంబంధిత తాసిల్దార్ కు కూడా వినతి పత్రం అందజేసి కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినట్టు వారు తెలిపారు. ఈ డంపింగ్ యార్డ్ లో చెత్తను డంపు చేయడం వల్ల గ్రామస్తులు అనారోగ్యాల పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు. ఈ కార్య క్రమంలో అఖిలపక్ష నాయకులు రుద్రవరం లింగస్వామి, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, రుద్రవరం సునీల్, ఎడ్ల మాలింగం, కన్నెబోయిన మాలింగం, కన్నబోయిన శ్రీధర్ యాదవ్, గుండాల నరేష్ గౌడ్, రుద్రవరం దశరథ, ఉపేందర్రెడ్డి, రుద్రవరం మధు, కన్నెబోయిన మురళి తదితరులు ఉన్నారు..