calender_icon.png 23 December, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ ఏఆర్ ఎస్‌ఐ మృతి

23-12-2025 12:00:00 AM

మేడిపల్లి, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ ఏఆర్ ఎస్ ఐ మృతి చెందిన సంఘ టన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిహెచ్‌ఎంసి పోచారం సర్కిల్ అన్నోజిగూడ ప్రకాష్ రావునగర్‌కు  చెందిన జగ్గాన్ని రఘుపతి (59) ఖైరతాబాద్‌లో ఇంటెలిజెన్సీలో ఏఆర్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉప్పల్ నుండి అన్నోజిగూడ వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా వెనుకవైపు నుండి టిప్పర్ ఢీకొని అక్క డికక్కడే మృతి చెందాడు.

మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. టిప్పర్ డ్రైవర్ లింగయ్యను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. టిప్పర్ వాహనం నిర్లక్ష్యంగా అతివేగంగా వెను క నుండి ఢీ కొట్టడంతోనే రఘుపతి మరణించారని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.