29-01-2026 01:00:10 AM
మున్సిపల్ ఎన్నికలవేళ తప్పుడు సంకేతాలకు పూనుకున్న వైనం!
మండిపడుతున్న కాంగ్రెస్ నాయకులు
అయిజ ,జనవరి 28: మున్సిపల్ ఎన్నికలవేళ అయిజ మున్సిపాలిటీ పట్టణ ప్రజల్లో బిఆర్‌ఎస్ పార్టీ ఆవాస్తవాలను ప్రచారం చేస్తూ తప్పుడు సంకేతాలను సృష్టిస్తుందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ప్రధాన కౌన్సిలర్ అభ్యర్థి మేకల నాగిరెడ్డి స్వల్ప అనారోగ్య రీత్యా ట్రీట్మెంట్ కొరకు కర్నూలు ఆసుపత్రికి వెళ్లిన క్రమంలో... అదే అదునుగా తీసుకొని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కొందరు...కాంగ్రెస్ నాయకులు మేకల నాగిరెడ్డి రాత్రికి రాత్రి బిఆర్‌ఎస్ పార్టీలోకి చేరినట్టు...ఏకంగా ఒక వార్డుకు సంబంధించి బీఆర్‌ఎస్ పార్టీ నుండి బరిలో నిలుస్తున్నట్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు సంకేతాలను వాట్సాప్ వేదికగా వైరల్ చేస్తున్నారు.
ఇట్టి విషయాన్ని పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉన్న మేకల నాగిరెడ్డిని వారు పరామర్శించారు.అనంతరం నాయకులు సమక్షంలోనే మేకల నాగిరెడ్డి మాట్లాడుతూ... తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. అనారోగ్య రీత్యా ఆసుపత్రికి వస్తే దానిని కొందరు పనిగట్టుకొని ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. వీరి వెంట కాంగ్రెస్ నాయకులు అధికార ప్రతినిధి షేక్షావలి ఆచారి, సింగల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు , తదితరులు పాల్గొన్నారు.